Breaking News

ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25 శాతం సుంకాలు..


Published on: 13 Jan 2026 16:38  IST

ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటుతో కునారిల్లుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. గత మూడు వారాలుగా ఇరాన్‌ ప్రభుత్వంపై ప్రజలు నిరసనలు, ఆందోళనలతో తిరుగుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యంతో ఇరాన్ ప్రభుత్వం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది

Follow us on , &

ఇవీ చదవండి