Breaking News

వస్త్రధారణ మహిళల హక్కు...


Published on: 14 Jan 2026 11:28  IST

సినీ నటీమణులపై దాడులు, వారి వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌ సంస్థల జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు అన్నారు. ‘దుస్తులు, సంస్కృతి, సైబర్‌ వేధింపులు’ అనే అంశాలపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ సభ్యులు వి.సంధ్య, కె.సజయ, క్రిష్ణ కుమారి, రచన, దీప్తి, జ్యోతి, శ్రావ్య, శ్వేత, తేజస్విని, అంజలి, ఆర్‌.వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి