Breaking News

రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి


Published on: 14 Jan 2026 12:29  IST

థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రచ్చసీమ ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో జరిగింది.ప్రమాద వివరాలను స్థానిక పోలీసు చీఫ్ థాచ్‌పోన్ చిన్నవాంగ్ వెల్లడించారు. ‘ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. గాయపడి న వారి సంఖ్య 30కు మించవచ్చు’ అని ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి