Breaking News

ఇటు ధోనికి ఒక‌టి, అటు సంజు శాంస‌న్‌కి..350ని చేరుకునేది ఎవ‌రు?


Published on: 20 May 2025 17:13  IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా మంగ‌ళ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. కాగా.. ఇప్ప‌టికే చెన్నై, రాజ‌స్థాన్‌లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించ‌డంతో ఈ మ్యాచ్ నామ‌మాత్రంగానే మారింది. అయితే..నేటి మ్యాచ్‌లో ధోని గ‌నుక ఓ సిక్స్ కొడితే టీ20ల్లో 350 సిక్స‌ర్లు మైలురాయిని చేరుకుంటాడు. అటు సంజూశాంస‌న్ రెండు సిక్స‌ర్లు బాదితే ఈ మైలురాయిని అందుకుంటాడు. వీరిలో ఎవ‌రు 350 సిక్స‌ర్ల మైలురాయిని అందుకుంటారో చూడాల్సిందే.

Follow us on , &

ఇవీ చదవండి