Breaking News

గాంధీ ఎంసీహెచ్​లో వెయిటింగ్​హాల్ ​కరువు-మెట్లు, చెట్లే దిక్కు


Published on: 21 May 2025 10:28  IST

గాంధీ దవాఖానలోని ఎంసీహెచ్(మాతాశిశు సంరక్షణ కేంద్రం) ఆవరణలో వెయిటింగ్ హాల్​లేక గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు, అనారోగ్య సమస్యలతో వచ్చే మహిళలు అవస్థలు పడుతున్నారు.హాస్పిటల్​ ఆవరణలో తగినంత స్థలం ఉన్నప్పటికీ వారు కూర్చునేందుకు వెయిటింగ్ హాల్ కోసం కనీసం షెడ్డు కూడా నిర్మించలేదు. దీంతో దవాఖానా మెట్లపై, చెట్ల కింద కూర్చోవడం లేదా నిలబడడం చేస్తున్నారు.ఇప్పటికైనా వెయిటింగ్​హాల్, వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి