Breaking News

వాషింగ్టన్ డీసీ యూదు మ్యూజియం వద్ద కాల్పులు..


Published on: 22 May 2025 11:51  IST

అగ్రరాజ్యం అమెరికా వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇద్దరు సిబ్బందిపై క్యాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. బుధవారం సాయంత్రం 3వ వీధి, ఎఫ్ వీధి సమీపంలోని క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో జ్యూయిష్ సమాజం చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించే మ్యూజియం ఉంది. ఆ సమయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయుధంతో వచ్చి దాడి చేసి, ఒక పురుషుడు, ఒక మహిళపై కాల్పులు జరిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి