Breaking News

కేంద్ర ప్రభుత్వంకు సుప్రీంకోర్టు నోటీసులు


Published on: 23 May 2025 14:32  IST

బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) నిషేధంపై ఇవాళ (శుక్రవారం) జరిగిన విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) ఆధారంగా ఈ విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

Follow us on , &

ఇవీ చదవండి