Breaking News

బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ..


Published on: 29 May 2025 09:35  IST

చైనా నక్క తోకను గట్టిగా తొక్కేసినట్లుంది. లేకపోతే.. 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటలా? చైనాలో మరో భారీ బంగారు గని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్‌ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్‌ ప్రావిన్స్‌ జియోలాజికల్‌ బ్యూరో ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్​సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్​పాట్ తగిలినట్లైంది. భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి