Breaking News

ఇజ్రాయెల్‌ చేతిలో కాంతి ఖడ్గం..!


Published on: 29 May 2025 11:35  IST

ఇజ్రాయెల్‌ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చింది. తాము లేజర్‌ ఆయుధమైన ఐరన్‌ బీమ్‌ వ్యవస్థలో తక్కువ శక్తిమంతమైన ఆయుధం వాడినట్లు బుధవారం ఆ దేశ రక్షణ శాఖ, ఐడీఎఫ్‌ ప్రకటించాయి. ఈ సరికొత్త సిస్టమ్‌లో తక్కువ శక్తి లేజర్‌ బీమ్‌ను తాము ఇంటర్‌సెప్టర్‌గా యుద్ధంలో వాడినట్లు పేర్కొన్నాయి. దీనిని ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో సైన్యానికి అందించనున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి