Breaking News

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..


Published on: 29 May 2025 12:23  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. శుక్రవారం న్యూఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. శుక్రవారం సాయంత్రం 4. 30 గంటల నుంచి 5. 30 గంటల మధ్య ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ రోజు రాత్రి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు. ఇక శనివారం ఉదయం 10.00 గంటలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్ట్‌కు ఆయన చేరుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి