Breaking News

గ్రూప్‌-1 అంశంపై హైకోర్టులో విచారణ..


Published on: 11 Jun 2025 18:23  IST

తెలంగాణలో గ్రూప్‌-1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టు లో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలుకు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.విచారణను ఆలస్యం చేయవద్దని, దీనివల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. టీజీపీఎస్సీ వినిపించిన వాదనలే మళ్లీమళ్లీ వినిపించవద్దని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి