Breaking News

హైప‌ర్‌సోనిక్ మిస్సైళ్ల‌తో విరుచుకుప‌డ్డ ఇరాన్..


Published on: 18 Jun 2025 11:38  IST

ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా అలీ ఖ‌మేనీ.. యుద్ధం మొద‌లైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇజ్రాయిలీల ప‌ట్ల ద‌య చూపాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. హైప‌ర్ సోనిక్ బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించిన‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 12.40 నిమిషాల స‌మ‌యంలో క్షిప‌ణుల‌తో ఇజ్రాయిల్‌పై విరుచుకుప‌డింది ఇరాన్. మ‌రో 40 నిమిషాల త‌ర్వాత 10 రాకెట్లు కూడా ఇజ్రాయిల్ వైపు దూసుకెళ్లాయి. సెంట్ర‌ల్ ఇజ్రాయిల్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ శ‌ర‌ణార్థి కేంద్రాల్లో అర్థ‌రాత్రి అల‌ర్ట్ జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement