Breaking News

కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నాం.. ట్రంప్‌


Published on: 28 Jun 2025 12:29  IST

కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌పై కెనడా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో సంచలన ప్రకటన చేశారు. ‘కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నాం’ అని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి