Breaking News

జులై 8 కంటే ముందే భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌..!


Published on: 30 Jun 2025 11:49  IST

భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యఒప్పందంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కీలక ప్రకటన జులై 8 కంటే ముందే వెలువడవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్న వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ వాషింగ్టన్‌లో ఉండి తుదివిడత సంప్రదింపులు మొదలుపెట్టారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇండస్ట్రియల్‌ గూడ్స్‌, లేబర్‌ ఇంటెన్సివ్‌ ప్రొడక్ట్‌ల పైనే దృష్టిపెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి