Breaking News

ఈ వాహనాలకు పెట్రోల్ బంద్.. రోడ్ల మీదకొస్తే..!


Published on: 01 Jul 2025 12:38  IST

కాలం చెల్లిన వాహనాలు, పాత బండ్ల యజమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కారు. ఇక నుంచి ఓల్డ్ వెహికిల్స్‌కు డీజిల్, పెట్రోల్ పోయొద్దనే నయా రూల్‌ను తీసుకొచ్చింది రేఖా గుప్తా ప్రభుత్వం. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక వాహనాలకే గాక దేశంలో ఎక్కడి నుంచి వచ్చే వాహనాలకైనా సరే.. పాతవని తేలితే ఇప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ పోయొద్దని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి