Breaking News

తెలంగాణ ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు


Published on: 01 Jul 2025 18:39  IST

ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తితో నిధులు మంజూరయ్యాయి. సీజీఎఫ్ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గోవింద‌రావు పేట మండ‌లం బుస్సాపూర్ జానకి రామాల‌యానికి రూ.12 ల‌క్ష‌లు, గుంజేడులోని ముస‌ల‌మ్మ ఆల‌యానికి రూ. 50 ల‌క్ష‌లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement