Breaking News

కన్వర్‌ యాత్రికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా..ముగ్గురు మృతి


Published on: 02 Jul 2025 16:02  IST

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన 21 మంది కన్వర్‌ యాత్రికులు ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్ వైపు ఓ ట్రక్కులో వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు టెహ్రీ జిల్లాలో అదుపుతప్పి బోల్తాపడినట్లు నరేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి సంజయ్‌ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి