Breaking News

ఇస్కాన్‌ దేవాలయంపై కాల్పులు..


Published on: 02 Jul 2025 16:54  IST

అమెరికాలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్‌ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘ఉతాహ్‌లోని స్పానిష్‌ ఫోర్క్‌లో ఉన్న ఇస్కాన్‌ శ్రీశ్రీ రాధా కృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తులకు, ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి