Breaking News

ఆగస్టు నుంచి ఉచిత కరెంట్..!


Published on: 17 Jul 2025 14:26  IST

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మొదటి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ సరసమైన ధరలకే విద్యుత్ అందిస్తున్నాము. ఆగస్టు 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ అమలవుతుంది. జులై నెల బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి