Breaking News

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం


Published on: 28 Apr 2025 14:43  IST

తిరుపతి జిల్లాలో (Tirupati District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి