Breaking News

అమెరికా వైమానిక దాడులు.. 68 మంది మృతి


Published on: 28 Apr 2025 20:43  IST

యెమెన్‌ లోని హౌతీ రెబల్స్‌పై అమెరికా భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్‌లోని ఆఫ్రికన్‌ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 68 మంది మరణించినట్లు స్థానిక మీడియాని ఊటంకిస్తూ ఓ ప్రముఖ వార్తా సంస్థ  నివేదించింది. సాదా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 47 మంది గాయపడినట్లు పేర్కొంది. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికా ఇంకా స్పందించలేదు.

Follow us on , &

ఇవీ చదవండి