Breaking News

వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు.


Published on: 30 Apr 2025 11:56  IST

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టాస్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)’లోకి తెలంగాణ డిస్కంలు ప్రవేశించనున్నాయి. ఈ స్కీంను రాష్ట్రంలో అమలుచేయనున్నట్టు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు తాజాగా సమాచారాన్నిచ్చాయి. ఇదే విషయాన్ని ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున మంగళవారం ధ్రువీకరించారు. అంటే.. అతి త్వరలో రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు రాబోతున్నాయన్నమాట. 

Follow us on , &

ఇవీ చదవండి