Breaking News

షూటింగ్‌ ప్రపంచకప్‌నకు మను బాకర్, కుశాలె


Published on: 30 Apr 2025 12:25  IST

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ రైఫిల్‌/పిస్టల్‌ ప్రపంచకప్‌లో భారత స్టార్లు మను బాకర్, స్వప్నిల్‌ కుశాలె బరిలో దిగనున్నారు. జూన్‌ 8న మ్యూనిక్‌లో ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల 10 మీటర్లు, 25 మీ పిస్టల్‌ ఈవెంట్లలో మను తన అదృష్టం పరీక్షించుకోనుంది. ఇటీవల అర్జెంటీనా, పెరూలో జరిగిన ప్రపంచకప్‌లలో భారత్‌ 6 స్వర్ణాలు సహా 15 పతకాలు సాధించింది. అర్జెంటీనాలో రెండు, పెరూలో మూడో స్థానంలో భారత్‌ నిలిచింది. ఈ రెండు టోర్నీల్లో పాల్గొన్న 13 మందికి మ్యూనిక్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు లభించింది.

Follow us on , &

ఇవీ చదవండి