Breaking News

చాట్‌జీపీటీకి పోటీగా మెటా ఏఐ యాప్‌


Published on: 30 Apr 2025 13:54  IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసింది. ప్రత్యేక ఫీచర్లతో ఈ అప్లికేషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. లామా 4 లాంగ్వేజ్‌ మోడల్‌తో రూపొందించిన కొత్త ఏఐ యాప్‌ను మెటా లాంచ్‌ చేసింది.ఎటువంటి ప్రశ్నలకైనా సునాయాసంగా సమాధానం చెప్పగలదని కంపెనీ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి