Breaking News

ఆ నీరు పాక్‌కు వెళతాయి.. మాకివ్వండి: హరియాణా


Published on: 30 Apr 2025 15:04  IST

పంజాబ్‌ వద్ద భాక్రా రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన తాగునీరు తమకు ఇవ్వాలని హరియాణా అభ్యర్థించింది. లేకపోతే.. ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లడం మినహా ప్రయోజనం లేదని పేర్కొంది. భారత్‌ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రకటన విడుదల చేశారు. సింధూ జలాల ఒప్పందం పరిధిలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ‘‘జూన్‌ నాటికి భాక్రా నంగల్‌ ఆనకట్టను ఖాళీ చేయడం అవసరం. అప్పుడే వర్షాకాలంలో నదీ జలాలను నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి