Breaking News

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.ఆరుగురి మృతి


Published on: 30 Apr 2025 16:49  IST

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వైద్య విద్యార్థులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బుచ్చిరెడ్డి పాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి