Breaking News

కర్రెగుట్ట కొండను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు


Published on: 30 Apr 2025 17:51  IST

నక్సల్స్ ఏరివేతలో భాగంగా గతవారంలో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి.ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో బుధవారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నక్సల్స్ అధీనంలోని కర్రెగుట్ర కొండను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతాన్ని నక్సల్స్ నుంచి విముక్తి చేస్తూ...తమ విజయానికి చిహ్నంగా కొండ పైభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి