Breaking News

53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌


Published on: 31 Oct 2025 11:22  IST

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబరు 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ భూషణ్‌ ఆర్‌ గవాయ్‌ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబరు 24న జస్టిస్‌ సూర్యకాంత్‌ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన దాదాపు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.2027, ఫిబ్రవరి 9న జస్టిస్‌ సూర్యకాంత్‌ పదవీ విరమణ చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి