Breaking News

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం


Published on: 01 Nov 2025 12:28  IST

నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు.మద్యం మత్తులో రాజు.. పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి