Breaking News

మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన ట్రక్ డ్రైవర్..


Published on: 03 Nov 2025 18:05  IST

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ట్రక్ డ్రైవర్ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రక్కుతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రమాదం జరిగిన లోహమండి రోడ్‌లోని ఓ షాపులో రికార్డు అయ్యాయి.ఆ ట్రక్ అడ్డం వచ్చిన వాహనాన్ని వాయు వేగంతో ఢీకొట్టుకుంటూ వెళ్లి పలువురి ప్రాణాలు తీసింది.

Follow us on , &

ఇవీ చదవండి