Breaking News

పట్టించుకోవడం లేదని కాల్చేశాడు..


Published on: 04 Nov 2025 16:58  IST

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు పట్టపగలు, నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కొన్ని రోజులుగా బాధిత బాలికను జతిన్ అనే దుండగుడు వెంబడిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఆ బాలిక పట్టించుకోకపోవడంతో ఈ దాడికి తెగబడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ బాలిక ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని హాస్పిటల్‌లోని బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్నారు

Follow us on , &

ఇవీ చదవండి