Breaking News

పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్‌


Published on: 05 May 2025 14:06  IST

పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను నెట్టింట్లో ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్‌ చేయడం సరికాదని ఆ ట్రోలింగ్‌ను ఖండించింది. ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ మృతుడి సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీనిపై కేంద్రం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ తరుణంలోనే మహిళా కమిషన్ నుంచి స్పందన వచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి