Breaking News

బావిలో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలు..


Published on: 06 Nov 2025 15:28  IST

తప్పిపోయిన కుమారుడు చనిపోయాడని అంత్యక్రియలు చేసిన ఒక కుటుంబానికి మూడు రోజుల తర్వాత ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా మూడో రోజు దహన సంస్కారాలు చేసిన స్థలంలో బూడిదను సేకరిస్తుండగా అకస్మాత్తుగా వారి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటన చంద్రపూర్ జిల్లాలో జరిగింది.బావిలో దొరికిన మృతదేహం పురుషోత్తంది కాదు.. మరి పురుషోత్తం కుటుంబ సభ్యులు దహనం చేసిన మృతదేహం ఎవరిదీ అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి