Breaking News

కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం


Published on: 05 May 2025 17:46  IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కాన్పూర్‌లోని చమన్‌ గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. బిల్డింగ్‌లోని మొదటి అంతస్తుల్లో ఫుట్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఉన్నది. మిగిలిన రెండు అంతస్తుల్లో ఓ కుటుంబం నివసిస్తున్నది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి