Breaking News

పాక్‌కు నిధులు ఇవ్వొద్దు..


Published on: 05 May 2025 18:47  IST

పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మరో చర్య చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న ఆ దేశానికి నిధులు ఇవ్వొద్దంటూ ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ (ఏడీబీ)ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఏడీబీ చీఫ్‌ మసాటో కాందతో ఇటీవల భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయంపై ఇటలీ ఆర్థికమంత్రితో పాటు, పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరుపుతున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి