Breaking News

తుఫాను బాధితులకు సాయంగా రూ.12.99 కోట్లు


Published on: 11 Nov 2025 16:31  IST

మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం  రూ.12.99 కోట్లు తక్షణ సాయం అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఈరోజు (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి