Breaking News

తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు


Published on: 18 Nov 2025 15:12  IST

జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరో జాతీయ జల అవార్డులు - 2024లో జాతీయ స్థాయిలో తెలంగాణ తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం- 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,20,362 పనులని పూర్తిచేసింది.జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి