Breaking News

మా సహనాన్ని పరీక్షించొద్దు - పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌


Published on: 08 May 2025 18:00  IST

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు పాక్‌ యత్నించగా.. వీటిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనాన్ని అలుసుగా  తీసుకుంటే ఆపరేషన్‌ సిందూర్‌ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘నేషనల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌’లో మాట్లాడుతూ దేశభద్రతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి