Breaking News

దేశంలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించి..


Published on: 25 Nov 2025 15:54  IST

చైనా పౌరుడు ఒక‌రు అక్ర‌మంగా భార‌త్‌లోకి ప్ర‌వేశించాడు. 49 ఏళ్ల ఆ వ్య‌క్తిని .. స‌హ‌స్త్ర సీమా బ‌ల్ ద‌ళాలు ప‌ట్టుకున్నాయి. ఇండో నేపాల్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న రూపైదియా వ‌ద్ద అత‌న్ని అరెస్టు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌హ‌రైచ్ జిల్లాలో ఈ ప్రాంతం ఉన్న‌ది. అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఆ వ్య‌క్తి.. బోర్డ‌ర్ ద‌గ్గ‌ర వీడియో తీస్తున్న‌ట్లు అత‌న్ని గుర్తించారు. అరెస్టు అయిన చైనా వ్య‌క్తి గ‌తంలో పాకిస్థాన్‌లోనూ ప‌ర్య‌టించాడు. అత‌ని వ‌ద్ద నుంచి పాకిస్థానీ, చైనీస్, నేపాలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి