Breaking News

భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం


Published on: 08 May 2025 18:25  IST

ఉగ్రమూకల నిర్మూలనలో భారతసైన్యం చూపిన తెగువ, ధైర్యసాహసాలను కీర్తిస్తూ... సంఘీభావం తెలపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇవాళ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ గాయకుడు బి ప్రాక్‌ (ప్రతీక్‌ బచన్‌) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా భారత సైనికులకు గౌరవ సూచకంగా దేశభక్తి గీతాలను ఆలపించనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి