Breaking News

మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్..


Published on: 09 May 2025 13:08  IST

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Jagan Mohan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. తనకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కొనసాగించాలని ఆయన కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు(High Court)లో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి తర్వాతకు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి