Breaking News

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు


Published on: 09 May 2025 18:56  IST

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు: 011-23387089, 9871999430, 9871999053, 9871990081, 9818395787 అని వెల్లడించింది. రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి.. ఏపీ భవన్‌ కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఏపీ విద్యార్థుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది.

Follow us on , &

ఇవీ చదవండి