Breaking News

ఉగ్ర‌వాదుల లాంచ్‌ప్యాడ్‌ పేల్చివేత‌.. వీడియో రిలీజ్


Published on: 10 May 2025 15:31  IST

మే 8, 9వ తేదీల్లో జ‌రిగిన డ్రోన్ దాడుల‌కు ప్ర‌తీకారంగా టెర్ర‌ర్ లాంచ్‌ప్యాడ్ల‌పై దాడులు చేసిన‌ట్లు భార‌తీయ ఆర్మీ ప్ర‌క‌టించింది. నియంత్రణ‌ రేఖకు స‌మీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్‌ప్యాడ్‌ల పేల్చివేత‌కు చెందిన వీడియోను భార‌తీయ ఆర్మీ రిలీజ్ చేసింది. ఆ లాంచ్‌ప్యాడ్ల వ‌ద్ద ఉగ్ర‌వాదుల‌కు చెందిన ప్లానింగ్‌, ఎగ్జిక్యూష‌న్ కొన‌సాగిన‌ట్లు ఆర్మీ పేర్కొన్న‌ది. భార‌తీయ పౌరులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై దాడులు చేసేందుకు ఉగ్ర‌వాదులు ఆ కేంద్రాల‌ను లాంచ్‌ప్యాడ్‌లుగా వాడుకుంటున్న‌ట్లు ఆర్మీ చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి