Breaking News

పాక్‌లో గురుద్వారాపై దాడి అంటూ అసత్య ప్రచారం


Published on: 10 May 2025 17:21  IST

పాకిస్థాన్‌ లోని నన్‌కానా సాహిబ్‌ గురుద్వారా పై భారత్ డ్రోన్‌ దాడికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం శనివారం కొట్టిపారేసింది. భారత్‌లో మతకల్లోలాలు సృష్టించడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఒక ప్రకటన చేసింది. నన్‌కిన్‌ సాహెబ్‌ గురుద్వారాపై భారత్‌ డ్రోన్‌ దాడికి పాల్పడిందంటూ సోషల్‌ మీడియాలో ఓ తప్పుడు వీడియో ప్రసారమవుతోంది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అది పూర్తిగా తప్పుడు వీడియో. అని పీఐబీ పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి