Breaking News

ఐపీఎల్‌ పునఃప్రారంభంపై బీసీసీఐ కీలక సమావేశం


Published on: 10 May 2025 21:25  IST

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి. మే 8న నిలిపివేసిన లీగ్‌కు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రానుండటంతో మార్గం సుగమమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. మిగిలిన 16 మ్యాచ్‌ల నిర్వహణపై మే 11న బీసీసీఐ కీలక సమావేశం జరగనుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఈ పరిణామాలతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి