Breaking News

తెలంగాణలో నలుగురు ఆర్టీఐ కొత్త కమిషనర్లు వీళ్లే..


Published on: 12 May 2025 18:53  IST

ఆర్టీఐ కమిషనర్లుగా కొత్తగా నలుగురిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస రావు , మోసిన పర్వీన్, దేశాల భూపాల్ ,బోరెడ్డి అయోధ్య రెడ్డిలను నియమించింది. ఏడుగురిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నలుగురిని నియమించింది. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్​ రావు సీనియర్​ జర్నలిస్టు కాగా యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి సీఎం సీపీఆర్వోగా ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసి​ని ప్రభుత్వం ఎంపిక చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి