Breaking News

సర్వం..శివోహం!


Published on: 16 Feb 2026 11:05  IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శంకరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమఃశివాయ..’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో మార్మోగాయి. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండతో పాటు అన్ని ఆలయాల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు, నేత్రపర్వంగా అభిషేకాలు జరిగాయి. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం రాత్రి పరమేశ్వరుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి