Breaking News

భారీగా దిగొచ్చిన పసిడి ధర


Published on: 12 May 2025 21:29  IST

అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. అమెరికా-చైనా టారిఫ్‌లకు 90 రోజుల బ్రేక్‌, రష్యా-ఉక్రెయిన్‌ శాంతి చర్చలు, భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రభావంతో బంగారం ఔన్సు ధర 3400 డాలర్ల నుంచి 3218 డాలర్లకు పడిపోయింది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.96,550కి తగ్గగా, హైదరాబాద్‌లో రూ.96,125 వద్ద ట్రేడవుతోంది. శనివారంతో పోలిస్తే రూ.3,400 తగ్గుదల. వెండి ధర కిలోకు రూ.200 తగ్గి రూ.99,700కి చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి