Breaking News

పాత ఫొటోలు చూపి.. కొత్త కథలు చెప్పిన పాక్‌ నేవీ..!


Published on: 13 May 2025 15:52  IST

తాజాగా పాక్‌కు చెందిన డీజీ ఐఎస్‌పీఆర్‌ ప్రెస్‌మీట్‌లో భారత్‌ నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్‌మెరైన్లతో సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపామంటూ ఓ ఫోటోను ప్రదర్శించారు. దీనిలో మూడు యుద్ధ నౌకలు వాటిపై ఎగురుతున్న మూడు నిఘా విమానాలతో చాలా గంభీరంగా ఉంది. తీరా ఈ ఫొటో ఎక్కడిదా.. అని మిలిటరీ విశ్లేషకులు పరిశీలించగా.. అది 2023 నాటిదని తేలింది. చైనా-పాక్‌ సంయుక్త నౌకాదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసిందిగా తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి