Breaking News

ఆరు రోజుల తర్వాత శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ తిరిగి ప్రారంభం


Published on: 13 May 2025 17:34  IST

జమ్ము కశ్మీర్‌ లోని శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు 32 విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తెరిచినప్పటికీ విమాన కార్యకలాపాలు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలి విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి